లేటరైట్‌ వివాదంపై స్పందించిన ప్రభుత్వం

తాజా వార్తలు

Updated : 10/07/2021 17:31 IST

లేటరైట్‌ వివాదంపై స్పందించిన ప్రభుత్వం

విజయవాడ:  విశాఖ జిల్లా నాతవరం మండలంలో లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ తవ్వకాలకు ప్రయత్నిస్తున్నారంటూ నిన్న తెదేపా నేతలు ఆ ప్రాంతంలో పర్యటించారు. అక్రమంగా నిర్మించిన రహదారులను పరిశీలించి నిరసన చేపట్టారు. దీనిపై ఏపీ గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. లేటరైట్‌ తవ్వకాల్లో ప్రస్తుతం ఎలాంటి అక్రమాలు జరగడం లేదని స్పష్టం చేశారు.

విజయవాడలోని గనులశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘విశాఖ జిల్లాలో ఆరు లేటరైట్‌ గనులకు లీజు అనుమతులు ఉన్నాయి. వాటిలో ఒక లీజు గడువు ముగిసింది, మరో రెండు లీజుల్లో పనులు జరగడం లేదు. అప్రోచ్‌ రోడ్డు లేక మరో 2 లీజుల్లో పనులు జరగడం లేదు. ప్రస్తుతం ఒక లీజులో 5వేల టన్నులకే అనుమతి ఇచ్చాం.  కొన్ని లీజులపై కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. 2018లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు 2019లో అనుమతి పునరుద్ధరించాం. లేటరైట్‌ గనులపై 2004లో ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌  నివేదిక ఇచ్చింది. లేటరైట్‌ తవ్వకాలపై కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) అనుమతి మేరకే తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అక్రమ తవ్వకాలు జరుపుతున్న వారిపై జరిమానాలు విధించాం. అక్రమ మైనింగ్‌  చేసిన సింగం భవాని, లోవరాజుకు రూ.19 కోట్లు జరిమానా విధించాం’’ అని గోపాలకృష్ణ ద్వివేది వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని