పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌, కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 28/06/2021 16:45 IST

పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌, కేసీఆర్‌

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ముగింపు ఉత్సవాలను నగరంలోని పీవీ మార్గ్‌లో ఉన్న జ్ఞానభూమిలో నిర్వహించారు. ఇందులో భాగంగా గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ నెక్లెస్‌రోడ్డులోని 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ మార్గ్‌ను ప్రారంభించారు.

పీవీ నిరంతర సంస్కరణ వాది: కేసీఆర్‌

పీవీ శతజయంతి ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు అని కొనియాడారు. ఏడాది కాలంగా పీవీ జయంత్యుత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. వీటిని విజయవంతంగా నిర్వహించిన కేశవరావుకు అభినందనలు తెలిపారు. పీవీని ఎంత గౌరవించుకున్నా తక్కువే అని కేసీఆర్‌ అన్నారు. ‘‘పీవీ ఒక కీర్తి శిఖరం, దీప స్తంభం. నవోదయ విద్యాలయాలు, గురుకులాలు పీవీ తీసుకొచ్చినవే. పీవీ విద్యానిధి, సాహిత్య పెన్నిధి. పీవీ నిరంతర సంస్కరణ వాది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో పీవీ నిష్ణాతులు. ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా భూసంస్కరణలు తెచ్చారు. పీవీ స్వయంగా తన 800 ఎకరాల భూమిని ప్రజలకు ఇచ్చారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు పూర్తిగా నడిపిన ప్రజ్ఞాశాలి పీవీ. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు అనేక సార్లు పీవీ సేవలు స్మరించుకున్నారు’’ అని కేసీఆర్‌ అన్నారు.

పీవీ శత జయంతి గొప్ప పండుగ: గవర్నర్‌

పీవీ శతజయంతి అందరికీ గొప్ప పండుగ అని గవర్నర్‌ తమిళిసై అన్నారు. ‘‘పీవీ విగ్రహాన్ని నేను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన రచనలను అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయం. పీవీ రాజకీయాలకు అతీతంగా గౌరవించుకోదగిన వ్యక్తి అని కలాం చెప్పేవారు’’ అని ఆమె అన్నారు. 

మరిన్ని ఫొటోల కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని