కొవాగ్జిన్‌ ఉత్పత్తిలో కీలక నిర్ణయం

తాజా వార్తలు

Published : 10/08/2021 23:25 IST

కొవాగ్జిన్‌ ఉత్పత్తిలో కీలక నిర్ణయం

దిల్లీ: కొవాగ్జిన్‌ టీకాల ఉత్పత్తి విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌ రాష్ట్రం అంకలేశ్వర్‌లో భారత్‌ బయోటెక్‌కు చెందిన చిరోన్‌ బెహ్రింగ్‌ యూనిట్‌లో వ్యాక్సిన్‌ తయారీకి అనుమతిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా అందరికి ఉచితంగా కొవిడ్‌ టీకా అందించాలనే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం.. టీకాల లభ్యతను పెంచడంతోపాటు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను వేగవంతం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ యూనిట్‌ ద్వారా దాదాపు 200 మిలియన్ల డోసులు తయారు చేయొచ్చని భారత్‌ బయోటెక్‌ ఇదివరకే వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని