ఆ కేసు విచారణకు ప్రత్యేకకోర్టు ఏర్పాటు చేయాలి
close

తాజా వార్తలు

Published : 08/05/2021 17:07 IST

ఆ కేసు విచారణకు ప్రత్యేకకోర్టు ఏర్పాటు చేయాలి

హైకోర్టుకు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. డీజీపీ వినతి మేరకు రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాశారు. కరీంనగర్‌లోని సెషన్స్ కోర్టును ప్రత్యేకంగా కేటాయించాలని లేఖలో కోరారు. అత్యంత కిరాతకంగా జరిగిన న్యాయవాదుల హత్య ప్రజల్లో సంచలనాన్ని, భయాన్ని రేకెత్తించిందని వివరించారు. కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు.

న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కారులో ప్రయాణిస్తున్న దంపతులను ప్రత్యర్థులు అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపారు. ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఈకేసులో కుంట శ్రీను, కుమార్‌, చిరంజీవి ప్రధాన నిందితులుగా ఉన్నారు. తమ పనులకు అడ్డుపడుతున్నారనే హత్య చేశామని నేరాన్ని అంగీకరించారు. గతంలో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షులను విచారించి మెజిస్ర్టేట్‌ సమక్షంలో వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ కేసులో పెద్దపల్లి జడ్పీఛైర్మన్‌ పుట్టా మధుపైనా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టును ప్రభుత్వం కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని