దిగిరానున్న వంట నూనెల ధరలు..!
close

తాజా వార్తలు

Published : 18/06/2021 01:30 IST

దిగిరానున్న వంట నూనెల ధరలు..!

దిల్లీ: వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీంతో దేశీయంగా వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ఒక టన్ను ముడి పామాయిల్‌పై 86 డాలర్లు, ఆర్బీడీ క్రూడ్‌ పామోలిన్‌ నూనెలపై 112 డాలర్ల మేర సుంకాన్ని తగ్గించినట్టు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) ప్రకటించింది. సోయా బీన్‌ నూనెలపైనా 37 డాలర్ల  మేర సుంకాన్ని తగ్గించినట్టు వెల్లడించింది. గురువారం నుంచే కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది.

సుంకం విలువ తగ్గించడం వల్ల మూల దిగుమతి ధరపై చెల్లించాల్సిన కస్టమ్స్ సుంకం తగ్గుతుందని ఆర్థిక నిపుణులు తెలిపారు. దీంతో దేశీయ మార్కెట్‌లో వంటనూనెల ధరలు దిగి వచ్చే సూచనలున్నట్లు వెల్లడించారు. దేశంలో వినియోగానికి తగినంతగా వంట నూనెల ఉత్పత్తి జరగడంలేదని ఏఎమ్‌ఆర్‌జీ, అసోసియేట్స్‌ సీనియర్‌ భాగస్వామి రజత్‌ మోహన్‌ తెలిపారు. ఈ కారణంగానే వీటి దిగుమతి ఇటీవల బాగా పెరిగిందని పేర్కొన్నారు. దీంతో కొద్ది నెలలుగా వంటనూనెల ధరలు క్రమంగా పెరిగాయన్నారు. మూల దిగుమతి సుంకం తగ్గింపు ప్రభావం రిటైల్‌ ధరలపై కనిపిస్తుందన్నారు. ఫలితంగా వినియోగదారులకపై భారం తగ్గుతుందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని