2 రోజులు ప్రభుత్వ వెబ్‌సైట్లు పనిచేయవు

తాజా వార్తలు

Updated : 08/07/2021 20:20 IST

2 రోజులు ప్రభుత్వ వెబ్‌సైట్లు పనిచేయవు

 నిలిచిపోనున్న ఆన్‌లైన్‌ సేవలు

యూపీఎస్‌ స్థాయి పెంపు నేపథ్యంలో అంతరాయం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనంలోని రాష్ట్ర డేటా కేంద్రం (ఎస్‌డీసీ)లో కొత్త యూపీఎస్‌ యూనిట్‌ ఏర్పాటు దృష్ట్యా ఈ నెల 9వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11న రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రభుత్వ వెబ్‌సైట్లకు అంతరాయం కలగనుంది. ఆ రెండు రోజులు ప్రభుత్వపరమైన ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావు. డేటా కేంద్రం ద్వారా ప్రస్తుతం ప్రభుత్వ వెబ్‌సైట్ల ఆన్‌లైన్‌ సేవలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఈ సేవలు పెరుగుతుండగా విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న యూపీఎస్‌(అన్‌ఇంటరప్టబుల్‌ పవర్‌ సప్లై) యూనిట్‌ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో స్థాయిని పెంచాలని నిపుణులు సిఫార్సు చేశారు. దీనికి అనుగుణంగా కొత్త యూపీఎస్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం రాత్రి 9 నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు ఏర్పడే అంతరాయాల గురించి అన్ని శాఖలకు ప్రభుత్వం సమాచారం అందించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని