Gucci: ₹500కు లభించే కుర్తా.. ₹2.5లక్షలట!
close

తాజా వార్తలు

Updated : 13/06/2021 14:41 IST

Gucci: ₹500కు లభించే కుర్తా.. ₹2.5లక్షలట!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన దేశంలో మహిళలు ఎక్కువగా ధరించే కుర్తాలు చిన్న వస్త్రదుకాణం నుంచి ఆన్‌లైన్‌ అంగళ్ల వరకూ అన్నిచోట్లా లభిస్తుంటాయి. వాటి నాణ్యతను బట్టి ధర రూ.వందల నుంచి రూ.వేలల్లో ఉంటుంది. అలాంటి ఈ దేశీయ కుర్తాలకు ఇటలీకి చెందిన ఫ్యాషన్‌ సంస్థ గూచీ నిర్ణయించిన ధర చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఎందుకంటే ఒక్కో కుర్తాను ఆ సంస్థ రూ.1.5లక్షల నుంచి రూ.2.5లక్షలకు విక్రయిస్తోంది.

‘ఫ్లోరల్‌ ఎంబ్రాయిడరీ ఆర్గానిక్‌ లినెన్‌ కాఫ్టన్‌’ పేరుతో గూచీ ఈ కుర్తాలను విక్రయిస్తోంది. ఆర్గానిక్‌ వస్త్రంతో తయారు చేయడంతోపాటు 1960-70నాటి వస్త్రధారణను స్ఫూర్తిగా తీసుకున్నారట. అందుకే, ఆ డిజైన్లను 2,100 డాలర్ల నుంచి 3,500 డాలర్ల ధర నిర్ణయించారు. అయితే కొన్ని వస్త్రాల ఖరీదు రూ.లక్షల్లోనూ ఉండటం మనకు చూశాం. కానీ, గూచీ విక్రయిస్తున్న కుర్తాలు సామాన్యులు రోజువారీ వస్త్రధారణగా వేసుకునే కుర్తాల మాదిరిగానే ఉన్నాయి. దీంతో భారతీయ నెటిజన్లు గూచీ సంస్థను ట్రోల్‌ చేస్తున్నారు. ‘ఈ కుర్తాను గూచీ సంస్థ రూ.2.5లక్షలకు విక్రయిస్తుంది. కానీ, అలాంటి కుర్తా రూ.500లకే లభిస్తుంది’ అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. ‘స్ట్రీట్‌ మార్కెట్‌లో బేరమాడితే రూ.100కే దొరుకుతుంది’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని