
తాజా వార్తలు
అంతరిక్షానికి పంపిన సమోసా.. ఫ్రాన్స్‌లో దిగింది!
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌లో ఉండే ఓ భారతీయ యువకుడు ఇటీవల సమోసాలను అంతరిక్షానికి పంపే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి వెళ్తుందనుకుంటే.. ఫ్రాన్స్‌లో ల్యాండ్ అయి వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
నీరజ్ గాధర్.. బ్రిటన్‌లో ఛాయ్ వాలా ఈటరీ పేరుతో రెస్టారెంట్ నడుపుతున్నాడు. గతంలో ఒకసారి నీరజ్ తన స్నేహితులతో మాట్లాడుతూ.. తన రెస్టారెంట్లో తయారు చేసిన సమోసాలను అంతరిక్షంలోకి పంపిస్తానని సరదాగా చెప్పాడట. అందరూ అప్పుడు నవ్వి ఊరుకున్నారు. అయితే, ఇటీవల కరోనా కారణంగా కస్టమర్లు రాకపోవడంతో రెస్టారెంట్ ఖాళీగా ఉంటోంది. ఇదే అదునుగా నీరజ్ తను చెప్పిన సరదా మాట నిజం చేయాలని నిర్ణయించుకున్నాడు. రెస్టారెంట్లో తయారు చేసిన సమోసాలను అంతరిక్షంలోకి పంపాలని సన్నాహాలు చేసుకున్నాడు.
స్థానికంగా అనువైన ప్రాంతాన్ని ఎంచుకున్న నీరజ్ తన స్నేహితులతో కలిసి హీలియం గాలి బుడగలో సమోసాలు, గో ప్రో కెమెరా, జీపీఎస్ ట్రాకర్ పెట్టి గాల్లోకి వదిలేశాడు. తొలి రెండు ప్రయత్నాల్లో గాలి బుడగ నింగిలోకి వెళ్లలేదు. కానీ, మూడోసారి వారు అనుకున్నట్లే గాలిబుడగ ఆకాశంలో తేలుతూ ప్రయాణం మొదలుపెట్టింది. ఆ బుడగ ప్రయాణాన్ని నీరజ్ జీపీఎస్, కెమెరా ఆధారంగా పరిశీలించాడు. అయితే, కొంత సమయానికి జీపీఎస్ ట్రాకర్ పనిచేయడం మానేసింది. దీంతో తన ప్రయత్నం విఫలమైందని నిరాశపడ్డాడు. కానీ, మరుసటి రోజు సమోసాలు మోసుకెళ్తున్న గాలిబుడగలోని జీపీఎస్ ట్రాకర్ పనిచేయడంతో అది ఫ్రాన్స్‌లో పడిపోయిందని తేలింది.
దీంతో నీరజ్ సోషల్‌మీడియా ద్వారా ఫ్రాన్స్‌లో ఉండే నెటిజన్లకు గాలిబుడగను కనిపెట్టమని విజ్ఞప్తి చేశాడు. యాక్సెల్ మాథన్ అనే వ్యక్తి నీరజ్ విజ్ఞప్తిని మన్నించి గాలిబుడగ పడిన ప్రాంతాన్ని కనిపెట్టాడు. ఫ్రాన్స్‌కు ఉత్తరంవైపు ఉన్న పకార్డీ ప్రాంతంలో పగిలిపోయిన గాలిబుడగ చెట్లపై పడి ఉండటాన్ని యాక్సెల్ గుర్తించాడు. ఈ విషయాన్ని స్థానిక మీడియాకు, నీరజ్‌కు తెలియజేశాడు. గాలిబుడగ ప్రయోగాన్ని నీరజ్ చిత్రీకరించి తన రెస్టారెంట్ యూట్యూబ్ ఛానెల్లో పెట్టడంతో ఈ అంశం వైరల్‌గా మారింది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- 2-1 కాదు 2-0!
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- ఇక చాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
