Harsh Goenka: ఆ సమయంలో ప్రియ మిత్రుడిని కౌగిలించుకుంటే చాలనుకున్నాం..!

తాజా వార్తలు

Published : 17/10/2021 15:52 IST

Harsh Goenka: ఆ సమయంలో ప్రియ మిత్రుడిని కౌగిలించుకుంటే చాలనుకున్నాం..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచదేశాలు ఎంతగా వణికిపోయాయో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో విధించిన లాక్‌డౌన్‌ చాలా మంది జీవితాలపై ప్రభావం చూపింది. ఇతరులకు దగ్గరగా వెళ్లి మాట్లాడాలంటేనే భయపడిపోయాం. ఇంట్లో ఉన్న బంధువులతో, చుట్టుపక్కల వారితో, స్నేహితులతో చనువుగా ఉండలేకపోయాం. తాజాగా కరోనా వ్యాప్తి సమయంలో.. మనం ఒకరు నుంచి ఏం కోరుకున్నాం? మన జీవితాల్ని మహమ్మారి ఏవిధంగా మార్చిందనే విషయాల్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ పోస్టులో ‘‘కరోనా మన జీవితాల్ని ఎలా మార్చిందంటే..’’ అని రాసుకొస్తూ.. కరోనాకు ముందు, కరోనా వ్యాప్తి సమయంలో మనం ఏవిధంగా ఆలోచించామో పోలుస్తూ ఒక ఫొటోను హర్ష గోయెంకా నెటిజన్లతో పంచుకున్నారు. ‘‘కరోనాకు ముందు మనం స్మార్ట్‌ఫోన్‌, పెద్ద టీవీ, అధిక డబ్బు తదితర అంశాలపై ఎక్కువగా ఆలోచించి వాటికోసం పరితపించేవాళ్లం. కానీ, కరోనా వ్యాప్తితో ఆ కోరికలన్నింటినీ పక్కన పెట్టి మనకు ఇష్టమైన స్నేహితుడి దగ్గరికి వెళ్లి కౌగిలించుకుంటే చాలనుకున్నాం. అప్పుడే ఒక స్నేహితుడి ఆలింగన ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం’’ అనేది ఆ పోస్టు సారాంశం. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ హర్ష గోయెంకా చేసిన ట్వీట్‌ను సమర్థిస్తూ రీట్వీట్‌ చేశారు. ‘‘అవును, కరోనా విజృంభణతో ఒకరితో మాట్లాడాలన్నా, ముట్టుకోవాలన్నా, ప్రేమతో దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకోవాలన్నా చాలా భయపడ్డాం. ఇబ్బందిపడ్డాం. అటువంటి రోజుల నుంచి త్వరగా బయటికి రావాలని కోరుకున్నాం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయితే మళ్లీ అలాంటి సాధారణ రోజులు రావొచ్చు’’ అని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని