close

తాజా వార్తలు

Published : 13/04/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేసీఆర్‌ సభ ఆపాలన్న పిటిషన్‌పై విచారణ

హైదరాబాద్‌: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో భాగంగా తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ప్రచార సభ నిర్వహించకుండా ఆపాలన్న పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టి తేల్చేందుకు హైకోర్టు నిరాకరించింది. స్వతంత్ర అభ్యర్థి సైదయ్యతో పాటు మరికొందరు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి వద్ద విచారణకు వచ్చాయి. సంబంధిత బెంచ్‌కు పిటిషన్లను పంపించాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా ఈనెల 14న అనుములలో తెరాస భారీ సభకు ఏర్పాట్లు చేస్తోందని.. సభను ఆపాలని పిటిషనర్లు పేర్కొన్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని