ఇంకా ఎన్నేళ్లు కావాలి?: హైకోర్టు

తాజా వార్తలు

Published : 07/07/2021 15:12 IST

ఇంకా ఎన్నేళ్లు కావాలి?: హైకోర్టు

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై ఏ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ వియజసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. హెరిటేజ్ భవనం మినహా మిగతా బ్లాక్‌లలో నిర్మించలేరా?అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోందని.. నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని ఏజీ ప్రసాద్ న్యాయస్థానాన్ని కోరారు. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని వ్యాఖ్యానించింది. ఆస్పత్రి సైట్ ప్లాన్, గూగుల్ మ్యాప్ ఎందుకు సమర్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ అంశంలో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంది. వైద్యారోగ్య శాఖ అధికారులు కరోనా నియంత్రణలో బిజీగా ఉన్నందున కొంత సమయం ఇవ్వాలని ఏజీ కోరారు. ఆస్పత్రి పూర్తిగా కూల్చి కొత్తగా నిర్మిస్తారా? లేక కొన్ని బ్లాక్‌లలో మాత్రమే నిర్మిస్తారా? అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలంది. ఆస్పత్రి నిర్మాణంపై 6 వారాల్లో తుది నిర్ణయం తీసుకొని బ్లూప్రింట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని