Ts News: హైదరాబాద్‌లో భారీ వర్షం

తాజా వార్తలు

Published : 07/07/2021 21:40 IST

Ts News: హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఖైరతాబాద్, అమీర్ పేట్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట గోల్నాక, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, నిజాంపేట్, ఉప్పల్, రామాంతపూర్, హయత్ నగర్, పెద్దఅంబర్‌పేట్‌లో కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వనస్థలిపురం, ఎల్బీనగర్, మన్సూరాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయం అవడంతో కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వర్షంలో తడుస్తూ వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షానికి మేడ్చల్ జిల్లా కీసర నాగారం చౌరస్తాలో అందరు చూస్తుండగానే భారీ హోర్డింగ్ కుప్పకూలింది. అటుగా వస్తున్న ద్విచక్రవాహనంపై హోర్డింగ్ పడటంతో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. మరికొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి రోడ్లపై పడ్డాయి. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ వెల్లడించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని