AP News: వర్మీ కంపోస్ట్‌ కేంద్రాలకు వైకాపా రంగులు తొలగించండి: హైకోర్టు 

తాజా వార్తలు

Published : 16/09/2021 23:42 IST

AP News: వర్మీ కంపోస్ట్‌ కేంద్రాలకు వైకాపా రంగులు తొలగించండి: హైకోర్టు 

అమరావతి: వర్మీ కంపోస్ట్‌ కేంద్రాలకు వైకాపా రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైకాపా రంగులను తొలగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెండు వారాల్లో రంగులు తొలగిస్తామని అధికారులు తెలియజేయగా ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కిందిస్థాయి అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 6 లోగా రంగులు తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. కోట్ల రూపాయల ప్రజాధనంతో పార్టీ రంగులు వేశారని పరసా సురేష్ వ్యాజ్యం దాఖలు చేయగా హైకోర్టు విచారణ జరిపింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని