ఆనందయ్య మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతి

తాజా వార్తలు

Updated : 25/05/2021 18:45 IST

ఆనందయ్య మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతి

అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతించింది. గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది. అనంతపురం జిల్లాకు చెందిన ఉమామహేశ్వరనాయుడు అనే వ్యక్తి ఆనందయ్య మందు పంపిణీపై హౌస్‌ మోషన్‌ పిటిషన్ దాఖలు చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని పిటిషనర్లు కోరారు. లోకాయుక్త ఆదేశంతో పంపిణీ నిలిపివేసినట్లు పోలీసులు చెబుతున్నారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మందు పంపిణీ అడ్డుకునే అధికారం లోకాయుక్తకు లేదని, మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేదని పిటిషనర్లు చెబుతున్నారు. కరోనాతో బాధపడుతున్న వారు హఠాత్తుగా మందు పంపిణీ నిలిపివేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని కోర్టును కోరారు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని