విశాఖ ఉక్కు: కేంద్రానికి హైకోర్టు నోటీసులు
close

తాజా వార్తలు

Updated : 15/04/2021 12:39 IST

విశాఖ ఉక్కు: కేంద్రానికి హైకోర్టు నోటీసులు


అమరావతి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ  విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై  స్పందించిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. 

కేంద్ర కేబినెట్‌ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని పిటిషన్‌లో కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చని, ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని లక్ష్మీనారాయణ పిటిషన్‌లో పేర్కొన్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కార్మికుల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన లక్ష్మీనారాయణ ... విశాఖ ఉక్కును నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మికసంఘాలు, వివిధ పార్టీల నేతలతో లక్ష్మీనారాయణ సమాలోచనలు జరుపుతున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని