TS NEWS: సాగర్‌ డ్యాం వద్ద భారీ భద్రత

తాజా వార్తలు

Updated : 30/06/2021 18:53 IST

TS NEWS: సాగర్‌ డ్యాం వద్ద భారీ భద్రత

నల్గొండ: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం, విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌ జలాశయం వద్ద నల్గొండ జిల్లా పరిధిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌  సాగర్‌ జలాశయం వద్దకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం.. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం వద్ద ఎస్పీఎఫ్‌ సిబ్బందితో పాటు ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్‌ఐలు, 100 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పోలీసు అధికారులు తెలిపారు. ఏపీ- తెలంగాణ అంతర్‌ రాష్ట్ర సరిహద్దు వద్ద కూడా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రైతుల అవసరాలను పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ఏపీ మంత్రులు పేర్ని నాని, అనిల్‌ కుమార్‌ మీడియా సమావేశంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖలు రాస్తామని వారు తెలిపారు. మరో వైపు .. ఎన్జీటీ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వద్దని చెప్పినా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని