HPCL: అగ్నిప్రమాదంపై హోం మంత్రి ఆరా

తాజా వార్తలు

Updated : 25/05/2021 18:05 IST

HPCL: అగ్నిప్రమాదంపై హోం మంత్రి ఆరా

విశాఖ: విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో అగ్నిప్రమాద ఘటనపై హోం మంత్రి సుచరిత ఆరా తీశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక క్రూడ్‌ ఆయిల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో ప్రమాదం జరిగినట్లు హెచ్‌పీసీఎల్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్రమత్తమైన సంస్థ అగ్నిమాపక సిబ్బంది అరగంటలోనే మంటలను అదుపు చేశారని ప్రకటనలో పేర్కొంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని  తెలిపింది. రిఫైనరీలోని మిగిలిన కార్యకలాపాలు యధావిధిగా జరుగుతున్నట్లు వెల్లడించింది.

ప్రమాద ఘటనపై ఇన్ఛార్జి మంత్రి కన్నబాబు ఆరా తీశారు. సెన్సార్లతోపాటు అత్యాధునిక అగ్నిమాపక హెచ్చరిక వ్యవస్థ హెచ్‌పీసీఎల్‌లో అందుబాటులో ఉందని, అది సమర్థంగా పని చేయడం వల్ల వెంటనే సిబ్బంది బయటకు వచ్చేశారని ఆయన అన్నారు. మంటలను అరగంటలో అదుపు చేశామని నగరపోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు. సంస్థలోపల 5  అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయని, బయటి నుంచి మరో అగ్నిమాపక వాహనం వచ్చిందని ఆయన అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని