హోమియోపతి ఔషధాలతో ఆందోళన దూరం
close

తాజా వార్తలు

Published : 13/06/2021 01:05 IST

హోమియోపతి ఔషధాలతో ఆందోళన దూరం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒత్తిడి, ఆందోళన.. ఇవి రెండూ లేని ఆధునిక జీవనాన్ని ఇవాళ మనం ఊహించుకోలేం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి, పడుకునే వరకూ నిత్యం ఎంతో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉంటాం. ఇంటి పనులు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, ఈ వ్యవహారాల్లో ఒత్తిడి, ఆందోళ స్థాయిలు శృతి మించినపుడు వాటి ప్రభావం మన ఆరోగ్యంపైనా పడుతుంది. తీవ్రమైన ఒత్తిడి మూలంగా కోపం, చిరాకు, డిప్రెషన్‌ వంటి మానసిక రుగ్మతలు కలుగుతాయి. అజీర్ణం, అల్సర్‌ వంటి సాధారణ సమస్యలను నుంచి గుండెజబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులు వచ్చి పడతాయి. మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఆందోళనను తగ్గించుకునేందుకు హోమియో వైద్యంలో ప్రత్యేక ఔషధాలు ఉన్నాయని చెబుతున్నారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్‌ పావులూరి కృష్ణచౌదరి.

ఆందోళన ఒత్తిళ్లను తగ్గించుకునేందుకు హోమియో వైద్యం తనదైన ప్రత్యేక ఔషధాలను అందిస్తుంది. వాటిలో జెల్సీమియం ఒకటి. వ్యక్తులు భవిష్యత్తు గురించి ఆందోళనతో సతమతమవుతుంటారు. మానసికంగా, శారీరకంగా బలహీనంగా ఉంటారు. వేదిక మీద మాట్లాడటానికి భయపడుతుంటారు. బలహీనత శృతి మించినపుడు పక్షవాతానికి కూడా గురవుతారు. వీళ్ల కనురెప్పలు వాలిపోతున్నట్టు కనిపిస్తాయి. ఈ ఆందోళన తీవ్రమైతే డయేరియా వస్తుంది. ఈ లక్షణాలు కనిపించినపుడు ‘జెల్సీమియం’ను వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

కొంతమందిలో అభద్రతా భావంతో కూడిన ఆందోళన కనిపిస్తుంది. వీళ్లను విమర్శిస్తే తట్టుకోలేరు. ఏ చిన్న జబ్బు చేసినా వైద్యులను సంప్రదిస్తుంటారు. ఒక్కోసారి ఎలాంటి కారణం లేకుండానే ఆందోళనకు గురవుతారు. వీళ్లకు ఇంట్లో కన్నా బయటకు వెళ్లినపుడు ఎక్కువ అందోళన కలుగుతుంది. అలాంటి వాళ్లు ‘ఆర్సెనికం ఆల్బ్‌’ అనే ఔషధం వాడాలి. 

నిష్కారణంగా తత్తరపాటుకు గురయ్యే వారికి, బహిరంగ ప్రదేశాల్లో ఆందోళన ఎదుర్కోనేవారికి ‘అర్జెంటమ్‌ నైట్రికమ్‌’ మంచి ఔషధం పనిచేస్తుంది. అర్జెంటమ్‌ వ్యక్తుల్లో భోళాతనం, భయం కనిపిస్తాయి. నిగ్రహం తక్కువ. చిన్నపిల్లల్లా వ్యవహరిస్తుంటారు. ఆందోళనతో పాటు పిరికితనం, న్యూనతతో బాధపడే వారికి ‘లైకో పోడియం’ బాగా పనిచేస్తుంది. వీరికి పేచీల మూలంగా ఆందోళన పెరుగుతుంది. చీకటన్నా, బహిరంగ ప్రదేశాలన్నా భయం. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇంట్లో వారిపై ఒంటికాలిపై లేస్తుంటారు. బయటివాళ్ల దగ్గర తోక ముడుచుకుని ఉంటారు. ఎవరైనా కృతజ్ఞత తెలియజేస్తే కంటతడి పెడుతుంటారు.

హడావిడి కారణంగా ఆందోళన పెరుగుతున్నపుడు, తిన్న తర్వాత ఆందోళన ఎక్కువ అవుతున్నప్పుడు, ఎప్పుడూ అస్థిమితంగా కదిలేవారికి ‘అయొడం’ బాగా పనిచేస్తుంది. అయొడం వ్యక్తులకు విపరీతమైన కోపం, ఆకలి ఉంటుంది. థైరాయిడ్‌ లోపం మూలంగా శుష్కించిపోతుంటారు. ఎలర్జీల వల్ల ఎప్పుడూ ముక్కు కారుతూ ఉంటుంది. మొరటు వ్యక్తుల్లో కనిపించే ఆందోళనకు, ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆందోళన చెందేవారికి ‘గ్రఫైటీస్‌’ మేలైన ఔషధం. సంగీతం వింటే వీరికి దుఃఖం పొంగుకొస్తుంది. ఇదొక ప్రత్యేక లక్షణం. వీరికి చర్మవ్యాధుల బెడద ఉంటుంది. ఈ విధంగా లక్షణాలను బట్టి ఔషధాలను ఎంపిక చేసుకుని వాడుకుంటే ఆందోళన తగ్గుముఖం పడుతుందని డాక్టర్‌ పావులూరి చెబుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని