చిన్నారులకు ‘కొవావాక్స్‌’ విడుదల అప్పుడే.. అధర్‌ పూనావాలా

తాజా వార్తలు

Updated : 08/08/2021 22:17 IST

చిన్నారులకు ‘కొవావాక్స్‌’ విడుదల అప్పుడే.. అధర్‌ పూనావాలా

దిల్లీ: చిన్నారుల్లో కొవిడ్‌ కట్టడికి అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ నోవావాక్స్‌ రూపొందించిన ‘కొవావాక్స్’ టీకా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అధర్‌ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. 18 ఏళ్లు ఆపైవారి కోసం తయారు చేసిన వ్యాక్సిన్‌ ఈ ఏడాది అక్టోబరులోనే వచ్చే అవకాశం ఉందన్నారు. భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) అనుమతులపై వాటి విడుదల ఆధారపడి ఉందని తెలిపారు. శుక్రవారం ఆయన పార్లమెంట్‌ ప్రాంగణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

కొవావాక్స్‌ టీకా రెండు డోసుల్లో వేస్తారని, దేశంలో విడుదలయ్యే సమయంలో ధర ఖరారయ్యే అవకాశం ఉందని అధర్‌ తెలిపారు. టీకాల ఉత్పత్తి, ఆర్థిక తోడ్పాటు విషయంలో కేంద్రం అండగా ఉందని, ఈ విషయంలో మద్దతుగా నిలుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. వైరస్‌ కట్డడిలో కొవావాక్స్‌ 100 శాతం ప్రభావవంతంగా ఉందని, 90.4 శాతం పనితీరు కనబర్చుతోందని నోవావాక్స్‌ గతంలో ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతానికి దేశంలో 18 ఏళ్లు, ఆపై వారికి టీకా వేస్తున్నారు. చిన్నారులకు వ్యాక్సినేషన్‌ ఈ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని