అంబులెన్స్‌ల నిలిపివేతపై హౌస్‌ మోషన్‌ పిటిషన్‌
close

తాజా వార్తలు

Published : 14/05/2021 14:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంబులెన్స్‌ల నిలిపివేతపై హౌస్‌ మోషన్‌ పిటిషన్‌

హైదరాబాద్‌: ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు అనుమతిలేని అంబులెన్స్‌లను రామాపురం క్రాస్‌రోడ్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిలిపివేస్తున్నారు. దీంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి వెంకటకృష్ణారావు తెలంగాణ హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అంబులెన్స్‌లు ఆపడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి అన్ని అంబులెన్స్‌లను అనుమతించేలా ఆదేశాలివ్వాలని  విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వస్తున్న కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో.. అంబులెన్స్‌లకు కూడా ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం రాత్రి మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి  తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని