Vaccine Certificate: వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

తాజా వార్తలు

Published : 26/09/2021 01:46 IST

Vaccine Certificate: వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకోవాలన్నా.. విదేశాలకు వెళ్లాలన్నా ఇప్పుడు వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. భవిష్యత్‌లో ఈ టీకా ధ్రువపత్రం తప్పనిసరి నిబంధన మరిన్ని చోట్ల అమలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాక్సిన్‌ వేసుకోవడం ఎంత ముఖ్యమో.. సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడమూ అంతే ముఖ్యం. కాబట్టి కొవిన్‌ పోర్టల్‌ నుంచి సులువుగా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కొవిన్‌ పోర్టల్‌ నుంచి..

* ముందుగా కొవిన్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://www.cowin.gov.in/homeలోకి వెళ్లాలి. రిజిస్టర్‌/సైన్‌ ఇన్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

* మీ 10 అంకెల మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. 

*  మీ ఫోన్‌కు వచ్చే OTPతో సైన్‌ఇన్‌ అవ్వాలి.

* ఒకసారి లాగిన్‌ అయితే, మీ మొబైల్‌ నంబర్‌తో ఎంతమంది రిజిస్టర్‌ అయ్యారో జాబితాను అక్కడ చూపిస్తుంది. 

*  రెండు డోసులు తీసుకున్నవారి పేర్ల వద్ద వ్యాక్సినేటెడ్‌ అని గ్రీన్‌ బ్యానర్‌లో కనిపిస్తుంది.

* కుడి వైపు సర్టిఫికెట్‌ అనే బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే పీడీఎఫ్‌ ఫార్మాట్‌ ఫైల్‌ కొత్త ట్యాబ్‌/ విండోలో ఓపెన్‌ అవుతుంది. దాన్ని తీసుకొని భద్రపరుచుకోవడమే. 

* అలాగే, ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా కూడా Vaccine Certificate డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొవిన్‌ ట్యాబ్‌లో వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. 13 అంకెల రిఫరెన్స్‌ ఐడీని ఎంటర్‌ చేయగానే మీ వివరాలు వస్తాయి. అక్కడే గెట్‌ సర్టిఫికెట్‌ అనే బటన్‌పై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ పీడీఎఫ్‌ ద్వారా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను పొందొచ్చు.

వాట్సాప్‌ ద్వారా..

కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని హెల్ప్‌డెస్క్‌ (MyGov Corona Helpdesk) ఇప్పుడు వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను నేరుగా వాట్సాప్‌లోనే పొందే సదుపాయం కల్పిస్తోంది. ఇందుకోసం 90131 51515 నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్‌లో చాట్‌ విండో ఓపెన్‌ చేసి డౌన్‌లోడ్‌ సర్టిఫికెట్‌ అని సందేశం పంపించాల్సి ఉంటుంది. మీ నంబర్‌ ఇది వరకే కొవిన్‌ ప్లాట్‌ఫాంలో నమోదై ఉంటే ఆ నంబర్‌కు ఆరెంకెల ఓటీపీ వస్తుంది. వ్యక్తి పేరును ధ్రువీకరించిన తర్వాత కొన్ని క్షణాల్లోనే వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ మీ ఫోన్‌లో ప్రత్యక్షమవుతుంది. ఒకవేళ వ్యాక్సిన్‌ కోసం వేరే మొబైల్‌ నంబర్‌ ఇచ్చి ఉంటే ఆ ఫోన్‌ నుంచే ఈ సందేశం పంపించాల్సి ఉంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని