Coronavaccine:మదనపల్లెలో జనం బారులు
close

తాజా వార్తలు

Published : 08/05/2021 10:48 IST

Coronavaccine:మదనపల్లెలో జనం బారులు

మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లెలో రెండో డోసు కరోనా టీకా కోసం వందలాది మంది ప్రజలు ఉదయాన్నే పీహెచ్‌సీకి పోటెత్తారు. కరోనా నిబంధనలు పాటించకుండా గుంపులుగుంపులుగా వరుసల్లో ఉండటంతో వైరస్‌ వ్యాప్తి చెందుతుందేమో అని వృద్ధులు భయాందోళన చెందుతున్నారు. రామారావు కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కొవాగ్జిన్‌ డోసులు తక్కువగా వచ్చినప్పటికీ.. రెండో డోసు కోసం గత కొన్ని రోజులుగా వేచి ఉన్న వాళ్లంతా టీకా కోసం ఒక్కసారిగా వచ్చారు. దీంతో పోలీసులు కూడా వారిని నియంత్రించలేకపోతున్నారు. కరోనా నిబంధనలను గాలికొదిలేయడంపై అందరూ ఆందోళన చెందుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని