Hyd Metro: మెట్రో సమయం పొడిగింపు

తాజా వార్తలు

Updated : 30/05/2021 21:52 IST

Hyd Metro: మెట్రో సమయం పొడిగింపు

హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో సైతం సమయాల్లో మార్పు చేసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. చివరి మెట్రో రైలు ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై చివరి స్టేషన్‌కు 12.45కి చేరుకుంటుందని మెట్రో ఎండీ ఎండీ కేవీబీ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని, స్టేషన్ల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉదయం 7 నుంచి 8.45 గంటల వరకు మాత్రమే మెట్రోరైలు సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్‌డౌన్‌లో సడలింపు ఇచ్చిన నేపథ్యంలో మెట్రో రైలు సమయాలను హైదరాబాద్‌ మెట్రో పొడిగించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని