Bapatla: సాగరం నుంచి నగరంలోకి రాములోరు

తాజా వార్తలు

Published : 17/09/2021 22:05 IST

Bapatla: సాగరం నుంచి నగరంలోకి రాములోరు

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక సముద్ర తీరంలో రాముల వారి పురాతన విగ్రహం స్థానిక మత్స్యకారుల కంట పడింది. పురాతన రాతి విగ్రహం తీరంలోకి కొట్టుకొచ్చినట్టు గమనించిన మత్సకారులు స్థానిక పోలీసులకు సమాచారమందించారు. మెరైన్‌ పోలీసులు రాములోరి విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విగ్రహం సముద్రపు అలలకు కొట్టుకొచ్చిందా? లేక ఎవరైనా తీసుకొచ్చి వదిలేశారా? అన్న కోణంలో విచారిస్తున్నట్టు సచివాయల కార్యదర్శి బాబూరావు తెలిపారు. దీనిపై పురావస్తుశాఖ అధికారులకు సమాచారమందించినట్టు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని