గుండెలో అమర్చే బయో ఎలక్ట్రానిక్‌ పరికరం  

తాజా వార్తలు

Published : 04/11/2020 22:09 IST

గుండెలో అమర్చే బయో ఎలక్ట్రానిక్‌ పరికరం  

హృద్రోగ సమస్యల గుర్తింపునకు, చికిత్సకు సాయం

వాషింగ్టన్‌ : గుండె జబ్బులు ఉన్న వాళ్లు వీలైంనంత త్వరగా వాటిని గుర్తించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఈ నేపథ్యంలో రబ్బరుతో అభివృద్ధి చేసిన బయో ఎలక్ర్టానిక్‌ పరికరాన్ని అమెరికాకు చెందిన శాస్ర్తవేత్తలు కనుగొన్నారు. దీన్ని గుండెలో అమర్చడం ద్వారా గుండె జబ్బుల సమాచారాన్ని బహిర్గతం చేయడంతో పాటు హృదయ కదలికలను పర్యవేక్షిస్తుంది.

అమెరికాలోని హ్యూస్టన్‌ యూనివర్సిటీ మెకానికల్‌ ఇంజినీర్లు ఆధ్వర్యంలో శాస్ర్తవేత్తలు ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. సాధారణంగా గుండె జబ్బులను గుర్తించడానికి పేస్‌మేకర్స్‌ తయారు చేసే కార్డియాక్‌ పరికరాలు కఠినంగా ఉంటాయి. కొన్ని మృదువైన పరికరాలు సైతం గుండెకు సంబంధించి కొంత వరకే సమాచారాన్నే సేకరించగలవు. ఈ నేపథ్యంలో బయో ఎలక్ర్టానిక్‌ పరికరం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరికరాన్ని గుండెలో అమర్చితే ఒకే సమయంలో హృదయం పనితీరు, ఉష్ణోగ్రత, స్పందనలతో పాటు గుండె సంబంధిత వ్యవస్థ గురించి తెలుపుతుంది.

తొలిసారి గుండె కణజాలానికి అనువుగా ఉండే రబ్బరు ఆధారిత బయో ఎలక్ర్టానిక్‌ పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు పరిశోధనలో భాగమైన టెక్సాస్‌లోని సూపర్‌ కండెక్టివిటీ సెంటర్‌ ప్రధాన పరిశోధకుడు కున్‌జియాంగ్ యు‌, హ్యూస్టన్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డి.కుక్‌ తెలిపారు. ఈ పరికరం వల్ల కఠినమైన ఎలక్ర్టానిక్‌ పదార్థాలతో రూపొందిన కార్డియాక్‌ పరికరాల వినియోగాన్ని భర్తీ చేయొచ్చు. ఇది పనిచేయడానికి బయటి నుంచి ఎటువంటి శక్తీ అందించాల్సిన అవసరం లేదు. గుండె కొట్టుకోవడం ద్వారా శక్తిని పొంది పని చేసే గొప్ప లక్షణం దీనికి ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని