ap news: రెసిడెంట్‌ వైద్యుల స్టైపండ్‌ పెంపు

తాజా వార్తలు

Published : 02/06/2021 19:29 IST

ap news: రెసిడెంట్‌ వైద్యుల స్టైపండ్‌ పెంపు

అమరావతి: సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులకు స్టైపండ్‌ను రూ.45వేల నుంచి 70వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. వారి డిమాండ్లపై సీఎస్‌ వద్ద చర్చించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం కరోనా సమయంలో ఆందోళన విరమించుకోవాలని కోరినట్టు స్పష్టం చేశారు. 

విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ వేసే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. విదేశాలకు వెళ్లే వ్యక్తులు పాస్‌పోర్టు నెంబరు కూడా ఇవ్వాలని సూచించారు. కొవిన్‌ యాప్‌లో ఈ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని దీన్ని సవరించే విషయంపై కేంద్రానికి లేఖ రాసినట్టు ఆయన పేర్కొన్నారు. మరో వైపు రాష్ట్రంలో క్రమంగా కొవిడ్‌ ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో పడకల ఖాళీల సంఖ్య పెరుగుతోందని, డిశ్ఛార్జిలు పెరుగుతుండటంతో ఈవెసులుబాటు కలుగుతున్నట్టు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని