ఈ బర్గర్‌ ధర రూ.4.42 లక్షలు..!

తాజా వార్తలు

Published : 14/07/2021 09:55 IST

ఈ బర్గర్‌ ధర రూ.4.42 లక్షలు..!

ఇంటర్నెట్ డెస్క్‌: సాధారణంగా బర్గర్‌ తినాలనిపిస్తే ఏ బేకరీకో వెళ్లి దర్జాగా ఆర్డరిస్తాం. బేకరీ స్థాయిని అనుసరించి బిల్లు మహా అయితే.. రూ.50 నుంచి 200 వరకు అవుతుంది. కానీ ఈ బర్గర్‌ తినాలంటే జేబులు ఒకసారి తడుముకోవాల్సిందే. ఎందుకంటే.. ఈ ఒక్క బర్గర్ ధర అక్షరాలా రూ.4.42 లక్షలు. ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన బర్గర్‌గా దీని తయారీదారులు చెప్పుకొంటున్నారు.  ఈ బర్గర్‌ను నెదర్లాండ్స్‌లోని డే డాల్టన్‌ రెస్టారెంట్‌లో పని చేస్తున్నరాబర్ట్‌ జాన్‌ డీ వీన్‌ అనే చెఫ్‌ తయారు చేశారు. దీనికి ‘గోల్డెన్‌ బాయ్‌’గా నామకరణం చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. అంతే.. ఆహార ప్రియులంతా దీనివైపు లొట్టలేసుకుంటూ చూస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ బర్గర్ తయారీలో ఖరీదైన బెలూగా కేవియర్, పెద్ద సముద్రపు పీత, కుంకుమ పువ్వు, వాగ్యు బీఫ్‌, పంది మాంసం, అరుదైన రకం తెల్లటి పుట్టగొడుగులు, చీజ్‌ వినియోగించినట్టు తయారీదారులు చెప్పుకొచ్చారు. వీటితో పాటు ప్రపంచంలో ఖరీదైన సివెట్‌ కాఫీ గింజలతో తయారు చేసిన బార్బెక్యూ సాస్‌ను ఇందులో ఉపయోగించారు. ఈ బర్గర్‌లో ఖరీదైన డామ్‌ పెరిగ్నాన్ షాంపేన్‌తో తయారు చేసిన బన్‌ను వాడారు. ఆ బన్లపై బంగారు ఆకులతో అలంకరించారు. తయారీలో ఇన్ని ఖరీదైన పదార్థాలు వాడినందుకే ఈ బర్గర్‌ ధర రూ.లక్షల్లో ఉంది. దీనిని విక్రయించగా వచ్చిన సొమ్మును ఏదైనా ఎన్జీవోకు దానంగా ఇవ్వాలనుకుంటున్నట్లు వీన్ తెలిపారు. 

 


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని