పొరుగు దేశాలతో సత్సంబంధాలకే భారత్‌ ప్రాధాన్యం
close

తాజా వార్తలు

Published : 24/06/2021 20:54 IST

పొరుగు దేశాలతో సత్సంబంధాలకే భారత్‌ ప్రాధాన్యం

దిల్లీ: పాకిస్థాన్‌ సహా పొరుగు దేశాలన్నింటితో సత్సంబంధాలనే భారత్‌ కోరుకుంటోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బగ్చీ పేర్కొన్నారు. గురువారం ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపించకుండా పాకిస్థాన్‌ చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. ఈ అంశంలో ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు కృషి చేయాలని కోరారు. అఫ్గానిస్థాన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పాకిస్థాన్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించగా.. బగ్చీ స్పందించారు. అఫ్గానిస్థాన్‌లో విద్యుత్తు సదుపాయం, నీటిపారుదల ప్రాజెక్టులు, పాఠశాలల నిర్మాణం, ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు భారత్‌ తోడ్పాటు అందించినట్లు వివరించారు. ఆ దేశాభివృద్ధికి పాకిస్థాన్‌ ఎంత వరకు సహకరించిందో ప్రపంచానికి తెలుసంటూ ఎద్దేవా చేశారు. శాంతి కోసం అఫ్గానిస్థాన్ చేపడుతున్న చర్యలకు భారత్‌ మద్దతుగా నిలుస్తుందన్నారు.       

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని