Facebook: ఫేస్‌బుక్‌లో ఏ పోస్టును ఎక్కువగా చూశారో తెలుసా?

తాజా వార్తలు

Published : 21/08/2021 01:31 IST

Facebook: ఫేస్‌బుక్‌లో ఏ పోస్టును ఎక్కువగా చూశారో తెలుసా?

80.6 మిలియన్ల వ్యూస్‌తో గౌర్‌ గోపాల్‌ దాస్ వర్డ్‌పజిల్‌ రికార్డ్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తమ నెటిజన్లు ఎక్కువగా చదివిన వార్తల గురించి వెల్లడించింది. టాప్ పెర్ఫార్మింగ్‌ కంటెంట్‌ తొలి రిపోర్టులో భాగంగా ఈ జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ మీడియా బీబీసీ నివేదిక  ప్రకారం.. రాజకీయ అంశాలే కాకుండా మీమ్స్‌, వైరల్‌ ఛాలెంజెస్‌, ఆలోచింపజేసే ప్రశ్నలతోనూ ఫేస్‌బుక్‌ వ్యూస్‌తో ముందుకు దూసుకెళ్తోందని తేలింది. కాగా భారతదేశానికి చెందిన గౌర్‌ గోపాల్‌ దాస్‌ పెట్టిన పోస్టుకు విశేష ఆదరణ లభించడం విశేషం. ‘‘మీరు మొదట చూసిన పదాలే.. మీ రియాలిటీ’’ అంటూ పెట్టిన ఓ పోస్టుని ఏకంగా 80.6మిలియన్ల మంది చూశారట. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్ 30 వరకూ సేకరించిన ఫేస్‌బుక్ డేటాలో ఈ విషయం వెల్లడైంది. గౌర్‌గోపాల్‌ దాస్‌.. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, రచయిత భారత్‌లో ప్రసిద్ధి. ‘పర్సనాలిటీ టెస్ట్‌’ అంటూ ఆయన అడిగే ప్రశ్నలు ఆలోజింపజేసేలా ఉంటాయి . అంతేకాదు.. జీవితం, వ్యక్తిత్వం, ఆలోచన తీరు వంటి అంశంలో ఆయనిచ్చే ప్రసంగాలు, సంధించే ప్రశ్నలు యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో విశేష ఆదరణ ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని