‘కరోనా చికిత్స ఫీజుల వివరాలు ప్రదర్శించండి’

తాజా వార్తలు

Published : 12/08/2020 21:14 IST

‘కరోనా చికిత్స ఫీజుల వివరాలు ప్రదర్శించండి’

ప్రైవేటు ఆస్ప్రతులకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు

హైదరాబాద్‌: ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్స ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు కరోనా బాధితుల నుంచి చికిత్స పేరుతో అధిక బిల్లులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తుండటంతో ప్రభుత్వం తాజాగా మరోసారి మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించింది. ఫీజుల వివరాలను ఆస్పత్రిలో కీలక ప్రదేశాల్లో ప్రదర్శించాలని తెలిపింది. పీపీఈ కిట్లు, ఖరీదైన మందుల ధరలను సైతం ఆస్పత్రిలో ప్రదర్శనకు ఉంచాలని చెప్పింది. కొవిడ్‌ చికిత్సకు వినియోగించే మందులకు ఎంఆర్‌పీ ధరలే వసూలు చేయాలని స్పష్టం చేసింది. కరోనా బాధితులను డిశ్చార్జి చేసే సమయంలో సమగ్ర వివరాలతో బిల్లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు ఉంటాయని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని