RTPCలో విద్యుదుత్పత్తికి అంతరాయం
close

తాజా వార్తలు

Published : 08/05/2021 09:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RTPCలో విద్యుదుత్పత్తికి అంతరాయం

కడప: కడప జిల్లా ఎర్రగుంట్లలోని రాయలసీమ బొగ్గు విద్యుదుత్పత్తి కేంద్రం(ఆర్టీపీసీ)లో కరెంటు ఉత్పత్తి నిలిచిపోయింది. మొత్తం ఆరు యూనిట్లలోని 1,650మెగా వాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బొగ్గు నిల్వలు లేక పూర్తిగా ఉత్పత్తిని నిలిపేసినట్లు అధికారులు వెల్లడించారు. నిన్నటి వరకు అరకొరగా ఉన్న బొగ్గు నిల్వలతో విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లు ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. కరోనా వేళ ఒడిశా నుంచి రావాల్సిన బొగ్గు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వివరించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని