Porn Case: రాజ్‌కుంద్రాకు బెయిల్‌ నిరాకరణ

తాజా వార్తలు

Published : 28/07/2021 23:56 IST

Porn Case: రాజ్‌కుంద్రాకు బెయిల్‌ నిరాకరణ

ముంబయి: అశ్లీల చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు ముంబయి కోర్టులో చుక్కెదురైంది. కుంద్రా సహా అతడి సహాయకుడు ర్యాన్‌ థోర్ప్‌కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం బుధవారం నిరాకరించింది. ఈ కేసులో పోలీసులు ఏ ప్రాతిపదికన వాదనలు వినిపించారో తెలపాలని కుంద్రా తరఫు న్యాయవాది కోర్టును కోరారు. పలు ఓటీటీల్లోనూ హాట్‌షాట్స్‌ తరహా చిత్రాలే ప్రసారమవుతుండగా.. పోలీసులు వీటిని మాత్రమే అశ్లీల చిత్రాలుగా ఎలా వర్గీకరిస్తారంటూ వాదనలు వినిపించారు. అయితే కోర్టు మాత్రం కుంద్రా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ కేసు విచారణలో భాగంగా రెండు వారాల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో కుంద్రా ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన్ను పోలీసులు గత సోమవారం అరెస్టు చేశారు. అతడి సంస్థకు సంబంధించిన సాంకేతిక వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న ర్యాన్‌ థోర్ప్‌ మరుసటి రోజు అరెస్టయ్యాడు. రాజ్‌ కుంద్రా సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు మొత్తం ‘హాట్‌షాట్స్‌’ యాప్‌ చుట్టూ తిరుగుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి తొలగించడంతో.. ప్లాన్ బీలో భాగంగా బాలీఫేమ్‌ పేరుతో మరో కొత్త యాప్‌ను కుంద్రా ప్రారంభించాడు. అయితే పోలీసులు అశ్లీల చిత్రాలుగా పెర్కొంటున్న వీడియోల్లో స్పష్టమైన లైంగిక చర్యలేవీ లేవని కుంద్రా పేర్కొన్నాడు. మరోవైపు ‘హాట్‌షాట్స్‌’ యాప్‌లోని కంటెంట్‌ కచ్చితమైన స్వభావం గురించి తనకేమీ తెలియదని కుంద్రా భార్య, బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి పోలీసులకు తెలిపారు. 


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని