Mothersday: జగన్‌, కేసీఆర్‌ విషెస్‌
close

తాజా వార్తలు

Updated : 09/05/2021 14:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mothersday: జగన్‌, కేసీఆర్‌ విషెస్‌

అమరావతి: అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌,  జగన్‌, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ‘‘స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. ఆప్యాయత, అనురాగాలకు చిరునామా అమ్మ.. మహోన్నతమైన మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు’’ అని కేసీఆర్‌  ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు.  ‘‘తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదు. అమ్మ ఇచ్చే ప్రోత్సాహం, ధైర్యం, స్ఫూర్తి వెలకట్టలేనిది. ప్రేమ, త్యాగం మూర్తీభవించిన మాతృమూర్తులందరికీ వందనాలు’’ అని జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.  

‘‘మానవజాతి మనుగడకు ఆధారమైన శక్తి స్వరూపిణి 'అమ్మ'. సంస్కృతికి వారధి, సమాజ వికాసానికి సారథి అమ్మే. అటువంటి అమ్మను గౌరవించడం మన సంస్కారానికి చిహ్నం. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రతి మాతృమూర్తికి శుభాకాంక్షలు’’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. నారా లోకేశ్‌ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తల్లి భువనేశ్వరితో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘మై బెస్ట్‌ ఫ్రెండ్‌’ అంటూ తన తల్లిని ఉద్దేశించి లోకేశ్‌ పేర్కొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని