జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ వాయిదా
close

తాజా వార్తలు

Published : 11/06/2021 20:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ వాయిదా

హైదరాబాద్‌: అరబిందో, హెటిరో భూ కేటాయింపులపై ఈడీ ఛార్జ్‌షీట్‌పై విచారణకు తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతించాలన్న జగన్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 22కి వాయిదా పడింది. ఈడీ కౌంటరు దాఖలు చేసినందున జగన్‌ తరఫు వాదనల కోసం విచారణ వాయిదా వేసింది. 

ఈకేసులో నిందితుడు అరబిందో మాజీ సెక్రటరీ పీఎస్‌ చంద్రమౌళి కరోనాతో మృతి చెందినట్టు ఆయన తరఫు న్యాయవాది ఖాసిం కోర్టుకు తెలిపారు. చంద్రమౌళి మరణ ధ్రువీకరణపత్రం కోర్టుకు సమర్పించాలని ఈడీని ఆదేశించింది. ఈడీ తరఫు న్యాయవాది ఇవాళ మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించకపోవడంతో అరబిందో, హెటిరో కేసులో అభియోగాల నమోదుపై విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. రాంకీ ఫార్మా కేసులో విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్‌పై ఇవాళ వాదనలు జరిగాయి. విజయసాయిరెడ్డి వాదనల కొనసాగింపు కోసం విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, వాన్‌పిక్‌ కేసుల విచారణను కూడా న్యాయస్థానం అదే రోజుకు వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని