Jagananna vidya deevena: ఉన్నతవిద్యతోనే పేదరికం నిర్మూలన : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

తాజా వార్తలు

Updated : 29/07/2021 15:10 IST

Jagananna vidya deevena: ఉన్నతవిద్యతోనే పేదరికం నిర్మూలన : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

అమరావతి: ఉన్నత చదువులు లేకపోతే పేదరికం ఎప్పటికీ పోదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. గురువారం ‘జగనన్న విద్యా దీవెన’ రెండో విడత సాయం నిధులు విడుదల చేశారు. మొత్తం 10.97 లక్షల మంది ఖాతాల్లో రూ.693.81 కోట్లను విడుదల చేశారు. ఇవి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా విద్యార్థులు చదివే ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ తదితర కోర్సుల ఫీజుల్ని నాలుగు విడతల్లో చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 

ఏప్రిల్‌ 19న మొదటి విడత ఇవ్వగా.. గురువారం రెండో విడత చెల్లింపులు చేసినట్లు వివరించింది. డిసెంబరులో మూడు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నాలుగో విడత నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. విద్యారంగంపై ఇప్పటి వరకు రూ.26,677 కోట్లు ఖర్చు చేశామని పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని