100%వ్యాక్సినేషన్‌.. దేశంలోనే మొదటి గ్రామం
close

తాజా వార్తలు

Updated : 08/06/2021 18:20 IST

100%వ్యాక్సినేషన్‌.. దేశంలోనే మొదటి గ్రామం

బందిపోరా: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే పుకార్లు చెలరేగి కొన్ని గ్రామాల్లో టీకా వేసుకునేందుకు ప్రజలు బయపడుతున్నారు. ఆరోగ్య సిబ్బంది టీకా వేసేందుకు వెళ్లినా బయపడి పారిపోతున్నారు. ఈనేపథ్యంలోనే జమ్మూ కశ్మీర్‌లోని ఓ కుగ్రామంలో ప్రతిఒక్కరు టీకా వేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరు టీకా వేసుకున్న దేశంలోనే మొదటి గ్రామంగా బందిపోరాలోని వేయాన్‌ కుగ్రామం నిలిచింది. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం ప్రకటించారు.  జిల్లా కేంద్రానికి వేయాన్‌ 28 కిలోమీటర్లు దూరం ఉటుందని, సరైన రోడ్డు సౌకర్యం లేని కారణంగా ఆ గ్రామానికి చేరాలంటూ 18 కిలోమీటర్లు నడవాల్సిందేనని ఓ వైద్యాధికారులు తెలిపారు. ఆరోగ్య సిబ్బంది విశేష కృషితోనే ఇది సాధ్యమైనట్లు వారు పేర్కొన్నారు.

వేయాన్‌ కుగ్రామంలో 18 ఏళ్ల దాటిన వారు మొత్తంగా 362 మంది ఉన్నారు. కాగా ఇందులో అధిక శాతం సంచార కుటుంబాలే ఉంటాయి. పశువుల మేత కోసం వారు నిత్యం వేరే ప్రాంతాలకు సంచరిస్తూ ఉంటారు. ‘గ్రామానికి ఇంటర్నెట్‌ సౌకర్యం లేదు. టీకా నమోదు చేసుకోవడం వారికి తెలియదు. కొందరికి తెలిసినా.. ఇంటర్నెట్‌ సౌకర్యం లేని కారణంగా టీకా నమోదు చేసుకునే వీలు లేదు’ అని బందిపోరా ప్రధాన వైద్యాధికారి బషీర్‌ అహ్మద్‌ తెలిపారు.  ఆరోగ్య సిబ్బంది విశేష కృషితో ‘జమ్మూ కశ్మీర్‌ మోడల్‌’లో అక్కడ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లో 45 ఏళ్లు పైబడిన 70 శాతం మందికి ఇప్పటివరకు కనీసం మొదటి డోసు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇచ్చిన వ్యాక్సిన్లకు ఇది రెట్టింపు శాతం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని