AP news: గ్రూప్‌-1 కేసులో తీర్పు రిజర్వు
close

తాజా వార్తలు

Published : 15/06/2021 18:43 IST

AP news: గ్రూప్‌-1 కేసులో తీర్పు రిజర్వు

అమరావతి: గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎనిమిది వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.

గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డిజిటల్‌ వాల్యూషన్‌ గురించి చివరి దశలో తెలిపారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఆంగ్ల మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూషన్‌ చేశారని, దీంతో ఆంగ్ల మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో వాల్యూషన్‌ ఎలా చేయిస్తుందని వాదించారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను పక్కన పెట్టి కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారని  పిటిషనర్‌ వాదించారు. ఇంటర్వ్యూలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. నిబంధనల ప్రకారమే గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాల్యూషన్‌ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది. త్వరలోనే గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు జరగనుండటంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని