AP News: మోగిన జూడాల సమ్మె సైరన్‌

తాజా వార్తలు

Updated : 07/06/2021 14:58 IST

AP News: మోగిన జూడాల సమ్మె సైరన్‌

అమరావతి: ఏపీలో సీనియర్‌, జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు సమ్మె సైరన్‌ మోగించారు. ఆరోగ్య బీమా, ఎక్స్‌గ్రేషియా సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విధులు బహిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. తమకు కొవిడ్‌ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు పెంచాలని.. స్టయిఫండ్‌లో టీడీఎస్‌ కోత విధించవద్దని జూనియర్ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈనెల 9న కొవిడ్‌తో సంబంధం లేని విధులు, 10న కొవిడ్‌ విధులు, 12న కొవిడ్‌ అత్యవసర విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రావాలని వారు కోరుతున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని