ap news: జస్టిస్‌ కనగరాజ్‌కు మరో పదవి 
close

తాజా వార్తలు

Published : 20/06/2021 17:28 IST

ap news: జస్టిస్‌ కనగరాజ్‌కు మరో పదవి 

అమరావతి: రాష్ట్ర పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో జస్టిస్‌ కనగరాజ్‌ మూడేళ్లపాటు కొనసాగనున్నారు. అథారిటీలో మరో ముగ్గురు సభ్యులను నియమించనున్నారు. జిల్లా స్థాయిలోనూ పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

తమిళనాడుకు చెందిన జస్టిస్‌ కనగరాజ్‌ను గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే, అప్పటికే పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను అర్ధాంతరంగా తొలగించి.. జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించడంపై పెద్ద వివాదం రేగింది. దీనిపై నిమ్మగడ్డ రమేశ్‌ న్యాయపోరాటం చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన న్యాయస్థానం నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను ఎస్‌ఈసీగా పునర్‌నియమిస్తూ అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. దాదాపు నెలకు పైనే ఎస్‌ఈసీగా వ్యవహరించిన జస్టిస్‌ కనగరాజ్‌ .. మళ్లీ ఇప్పుడు రాష్ట్ర పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని