కథా రచయిత కారా మాస్టారు కన్నుమూత

తాజా వార్తలు

Updated : 04/06/2021 12:44 IST

కథా రచయిత కారా మాస్టారు కన్నుమూత

శ్రీకాకుళం: ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో ఉన్న ఆయన.. శ్రీకాకుళంలోని తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1924లో లావేరు మండలం మురపాకలో జన్మించారు. ఆయన పూర్తి పేరు కాళీపట్నం వెంకట సూర్య రామ సుబ్రహ్మణ్యేశ్వర రావు. 

కారా మాస్టారుగా ప్రసిద్ధి పొంది ఆయన.. శ్రీకాకుళం నగరంలో కథానిలయాన్ని స్థాపించారు. తన రచనలకు గాను పలు కేంద్ర, రాష్ట్ర అవార్డులు పొందారు. యజ్ఞం తొమ్మిది కథలకు కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్నారు. 1996లో సాహిత్య అవార్డు పొందారు. రాష్ట్ర సాంస్కృతిక మండలి హంస అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని