కేసీఆర్‌ మనవడికి డయానా అవార్డు!

తాజా వార్తలు

Published : 29/06/2021 01:38 IST

కేసీఆర్‌ మనవడికి డయానా అవార్డు!

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు.. మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షుకు అరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న వారికి అందించే ప్రతిష్టాత్మక డయానా అవార్డు - 2021 హిమాన్షును వరించింది. గ్రామాల స్వయం సమృద్ధి కోసం హిమాన్షు ఇటీవల ‘షోమా’ పేరుతో ఓ వీడియో రూపొందించారు. కల్తీ ఆహారం పట్ల అవగాహన కల్పిస్తూ.. కల్తీ లేని ఆహారాన్ని ఉత్పత్తి చేసేలా గ్రామీణ ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంపై, గ్రామాలు స్వయం సమృద్ధి పొందడమెలా అనే విషయాలను వీడియోలో వివరించారు.

హిమాన్షు చేసిన ప్రయత్నానికి మెచ్చిన డయానా అవార్డు ఆర్గనైజేషన్‌ అతడికి అవార్డును ప్రకటించింది. ఈ విషయాన్ని హిమాన్షు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తనకు అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దివంగత బ్రిటన్‌ యువరాణి.. డయానా జ్ఞాపకార్థం డయానా అవార్డ్‌ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశారు. సమాజానికి సేవ చేస్తున్న 9 - 25 ఏళ్ల మధ్య వయస్కులకు ఏటా ఈ అవార్డును అందజేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని