AP News: కేజీహెచ్‌లో వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి సిజేరియన్‌
close

తాజా వార్తలు

Updated : 10/06/2021 14:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: కేజీహెచ్‌లో వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి సిజేరియన్‌

విశాఖపట్నం (వన్‌టౌన్‌): విశాఖపట్నం కింగ్‌జార్జ్‌ ఆస్పత్రి (కేజీహెచ్‌) వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కరోనాతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గర్భిణికి వైద్యులు విజయవంతంగా సిజేరియన్‌ పూర్తిచేశారు.  కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో ఉన్న 30 ఏళ్ల గర్భిణికి గైనకాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.కవిత ఆధ్వర్యంలోని బృందం ఈ ఉదయం శస్త్రచికిత్స చేసింది. సిజేరియన్‌ చేసి మగబిడ్డను బయటకు తీశారు.

వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి శస్త్రచికిత్స చేయడం కేజీహెచ్‌ చరిత్రలో తొలిసారి అని డాక్టర్‌ కవిత తెలిపారు. అనంతరం శిశువుకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్‌ వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్యం కూడా మెరుగు పడిందని.. ఆమె ఆక్సిజన్‌ స్థాయులు పెరిగాయని వైద్యులు తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని