అది ప్రధాని మోదీకే సాధ్యం: కిషన్‌రెడ్డి
close

తాజా వార్తలు

Updated : 02/01/2021 21:40 IST

అది ప్రధాని మోదీకే సాధ్యం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: భారతదేశాన్ని సమర్థంగా పాలించడమే కాకుండా ప్రపంచ దేశాల ముందు గర్వించే స్థాయికి దేశాన్ని తీసుకెళ్లడం ప్రధాని నరేంద్రమోదీకి మాత్రమే సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోనే ప్రజా అమోదం పొందిన నాయకుల్లో ప్రధాని మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 74 శాతం మంది ప్రజలు మోదీకి మద్దతు తెలిపారని.. బ్రెజిల్ అధ్యక్షుడు‌, అమెరికా అధ్యక్షుడు, యూకే ప్రధాని తర్వాతి స్థానాల్లో ఉన్నారన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రధాని సమర్థంగా పనిచేశారని కొనియాడారు. ఈ మేరకు తెలుగు ప్రజల తరఫున ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లోనూ తెలుగు ప్రజలు ఆయనకు అండగా నిలుస్తూ ఆశీర్వదించాలని కిషన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి..

పచ్చబొట్టు.. పదికాలాలపాటు!

గంగూలీకి ఇలాంటి సమస్య ఉందని ఊహించలేం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని