Krishna River 9న కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం

తాజా వార్తలు

Updated : 05/08/2021 14:58 IST

Krishna River 9న కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం

హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఆయా బోర్డులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 9న రెండు బోర్డులూ ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి.ఈ మేరకు రెండు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ సమాచారమిచ్చింది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. గెజిట్‌లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. 

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించిన కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ, జులై 15న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌ స్వాగతించగా, తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గత నెల 28న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి రెండు బోర్డుల ఛైర్మన్లకు లేఖ రాశారు. గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలు నిర్ణయించిన గడువులోగా అమలయ్యేలా తేదీల వారీగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి పంపాలని సూచించారు. దీని 11 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన గోదావరి నదీ యాజమాన్యబోర్డు, ఈ కమిటీతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసింది. కమిటీలో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, పరిపాలనా విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులు ఉన్నారు.

తెలంగాణ ప్రభుత్వం, గోదావరి బోర్డు అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్న దశలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 12 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకోవడంతో పాటు మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. మొదట పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని కోరిన తెలంగాణ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కాలేదు. మరోవైపు ఏపీ కూడా గెజిట్‌లో కొన్ని సవరణలు చేయాల్సి ఉందని, అవి జరిగాక ముందడుగు వేద్దామని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బోర్డు ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని