కృష్ణాబోర్డు సమావేశం వాయిదా

తాజా వార్తలు

Updated : 08/07/2021 19:09 IST

కృష్ణాబోర్డు సమావేశం వాయిదా

హైదరాబాద్‌: రేపు జరగాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. సమావేశం తేదీని త్వరలో వెల్లడిస్తామని కృష్ణాబోర్డు తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదంతో కేఆర్‌ఎంబీ భేటీ కీలకంగా మారింది.

అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ఆపాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతిలేకుండా నిర్మిస్తోందని, శ్రీశైలం, సాగర్‌, పులిచింతల నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభించడంతో సాగునీరు సముద్రం పాలవుతున్నాయని ఏపీ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో జలవివాదంపై చర్చించేందుకు ఈనెల 9న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. కృష్ణా బోర్డు భేటీ వాయిదా వేయాలని, 20 తర్వాత నిర్వహించాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. ఈనేపథ్యంలో రేపు జరగాల్సిన కృష్ణా బోర్డు సమావేశం వాయిదా పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని