close

తాజా వార్తలు

Updated : 12/04/2021 08:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేటీఆర్‌ సర్‌ మీరు సినిమాల్లో ట్రై చేయలేదా?

ఇంటర్నెట్‌డెస్క్‌: కేటీఆర్‌ సర్‌.. మీరు హీరోలా ఉన్నారు. బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల్లో ఎప్పుడూ ప్రయత్నించలేదా? అని ఓ అభిమాని ట్విటర్‌ వేదికగా అడిగిన ప్రశ్నకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సరదాగా సమాధానం ఇచ్చారు. #AskKTR పేరుతో ఆదివారం సాయంత్రం ట్విటర్‌ వేదికగా ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ యంగ్‌ లుక్‌లో ఉన్న ఫొటోను అభిమాని పంచుకుంటూ పై ప్రశ్న అడగ్గా, అందుకు కేటీఆర్‌ బదులిస్తూ ‘‘బాలీవుడ్‌, హాలీవుడ్‌, మరీ పెద్ద చెట్టు ఎక్కిస్తున్నావ్‌’ అంటూ నవ్వుతున్న ఎమోజీని పంచుకున్నారు.

మీ ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరు?

కేటీఆర్‌: రాహుల్‌ ద్రవిడ్‌.. ఇప్పుడు విరాట్‌ కోహ్లీ

ప్రతి నియోజకవర్గంలోనూ సోషల్‌ మీడియా వారియర్స్‌ మీటింగ్‌ ప్రారంభించేలా చూస్తారా?

కేటీఆర్‌: తప్పకుండా

కరోనా విజృంభించిన 2020లోనూ తెలంగాణ రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మీ దార్శనికమైన నాయకత్వంపై తెలంగాణ ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది. మరి 2021 ఎలా ఉండబోతోంది?

కేటీఆర్‌: మా వంతు కృషి చేస్తాం సోదరా! కేసీఆర్‌గారి నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం పెట్టుబడులు వచ్చేందుకు ప్రధాన కారణం. మీకు ధన్యవాదాలు

తెలంగాణకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ సప్లయ్‌ ఎలా ఉంది?

కేటీఆర్‌: దేశ వ్యాప్తంగా కొరత ఉందని తెలిసింది.

అనంతగిరి హిల్స్‌ గురించి కేసీఆర్‌ ఎన్నో సార్లు మాట్లాడారు. అనంతగిరి ప్రాంతాన్ని పర్యాటకానికి కేంద్రంగా మారుస్తారని అనుకుంటున్నా.

కేటీఆర్‌: తప్పకుండా చేస్తాం. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సబిత గారు ఆ దిశగా పనులు మొదలు పెట్టారు.

జిల్లాల్లో ఐటీ హబ్స్‌ ప్రారంభించే ఆలోచన ఉందా?

కేటీఆర్‌: మహబూబ్‌నగర్‌ను అలా తీర్చిదిద్దుతున్నాం.

అన్నా.. తెలంగాణలో ప్రభుత్వ పథకాలన్నీ బాగున్నాయి. కానీ, ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్‌..

కేటీఆర్‌: తప్పకుండా నాయక్‌..

కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2021లో తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉంటుందా?

కేటీఆర్‌: అది మంచి ఆలోచన కాదని నా అభిప్రాయం.

జాతిరత్నాలు ఎలా ఉంది?

కేటీఆర్‌: చాలా బాగా నచ్చింది. పూర్తి హాస్యభరిత చిత్రం.

సర్.‌. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా కూతురిని హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనుకుంటున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో ధైర్యం సరిపోవడం లేదు.

కేటీఆర్‌: తాజా బడ్జెట్‌లో ఇందుకోసం రూ.2వేల కోట్లు కేటాయించాం. వీలైనంత త్వరగా ఆ పనులు మొదలు పెడతాం.

సర్‌.. సిద్ధిపేట గురించి ఒక్క మాట చెప్పండి.

కేటీఆర్‌: తెలంగాణలోని ఉత్తమ పట్టణాల్లో ఒకటి.

మరిన్ని వ్యాక్సిన్‌లు కావాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కారు కోరింది. అక్కడి నుంచి సమాధానం వచ్చిందా సర్‌?

కేటీఆర్‌: ప్రస్తుతానికి దాని గురించి తెలియదు ధన్య

పశ్చిమ బెంగాల్‌, కేరళలో ఎవరు గెలుస్తారు?

కేటీఆర్‌: ప్రజాస్వామ్యం గెలుస్తుంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజా టాయ్‌లెట్‌లు సరిగా పనిచేయటం లేదు. కొన్నింటిని సరిగా నిర్వహించటం లేదు. కాయిన్‌ వాటర్‌ మెషీన్స్‌ కూడా పనిచేయటం లేదు.

కేటీఆర్‌: జీహెచ్‌ఎంసీ తనవంతు కృషి బాగానే చేస్తోంది. కొన్నింటిని ధ్వంసం చేశారు. ఇంకొన్నింటిని దొంగిలించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, వాటిని జాగ్రత్తగా చూసుకోవటం కూడా ప్రజల బాధ్యత.

రోడ్డు దాటేందుకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయండి.

కేటీఆర్‌: నగరంలో 50కు పైగా ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయి.

మీరు వ్యాక్సిన్‌ తీసుకున్నారా?

కేటీఆర్‌: ఇంకా లేదు

ఎంపీటీసీల కోసం ప్రభుత్వం ఏమైనా ప్రణాళిక సిద్ధం చేస్తోందా?

కేటీఆర్‌: ఇటీవల బడ్జెట్‌లో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు నిధులు కేటాయించారు.

తెలంగాణ ప్రభుత్వం కింద ఒప్పంద పద్ధతిలో 1530మంది వైద్యులం పని చేస్తున్నాం. మాకెలాంటి ఉద్యోగ భద్రతా లేదు. కరోనా సమయంలోనూ ఎలాంటి భయాలకు వెరవకుండా పని చేశాం. మమ్మల్ని రెగ్యులర్‌ చేయండి?

కేటీఆర్‌: ఈ విషయాన్ని ఆరోగ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా.

తమన్‌: సమాజంలో కరోనా వ్యాక్సిన్‌పై అవగాహన పెంచేందుకు గాయనీ, గాయకులతో పాటను సిద్ధం చేసేందుకు నా వంతు ప్రయత్నిస్తా!

కేటీఆర్‌: మంచి ఆలోచన బ్రదర్‌

సర్‌ నేను బ్యాంక్‌లో పనిచేస్తా. కరోనా సమయంలోనూ విధులకు హాజరయ్యాను. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. నా స్నేహితులు ఎక్కువ మంది కరోనా బారినపడుతున్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా బ్యాంకుల్లో పనిచేసే వారందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చే ఏర్పాటు చేయగలరు!

కేటీఆర్‌: వ్యాక్సిన్‌ నియమ, నిబంధనలన్నీ భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

ఉప ఎన్నికల తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఆశించవచ్చా?

కేటీఆర్‌: తప్పకుండా

సర్‌.. మీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అద్భుతం. రహస్యం ఏంటి? ఏదైనా టిప్‌ చెబుతారా?

కేటీఆర్‌: ఆలోచనల్లో స్పష్టత ఉన్నప్పుడే మనం చక్కగా భావవ్యక్తీకరణ చేయగలం. ఎప్పటికప్పుడు పదాలను నేర్చుకునేందుకు ప్రయత్నించండి.

నిజామాబాద్‌ రైతుల కల అయిన పసుపు బోర్డు ఎప్పుడు వస్తుంది?

కేటీఆర్‌: పసుపు బోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌పై రాసి మరీ వాగ్దానం చేసిన జెంటిల్‌మన్‌ను అడగండి.

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికపై మీ అభిప్రాయం?

కేటీఆర్‌: నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తెరాస విజయం సాధిస్తుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని