మంచి మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 08/07/2021 22:15 IST

మంచి మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. గతంలో దిల్లీలో ఐఏఎస్ కోచింగ్‌ తీసుకుంటూ లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న షాద్‌నగర్‌కు చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. దిల్లీలోని ప్రముఖ లేడి శ్రీరామ్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యేది. లాక్‌డౌన్‌ కారణంగా ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు అవసరమైన ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేయలేని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. ఒకవైపు ఎంచుకున్న తన లక్ష్యం, మరోవైపు ఉన్నత చదువు దూరమవుతుందేమోనన్న బాధతో ఆత్మహత్య చేసుకుంది.

ఐశ్వర్య కుటుంబం పేదరికంతో తీవ్ర ఇబ్బందులు పడుతుందని పలువురు కేటీఆర్ దృష్టికి తీసుకురాగా.. అండగా నిలిచేందుకు కేటీఆర్ ముందుకు వచ్చారు. ఐశ్వర్య కుటుంబసభ్యులను ప్రగతిభవన్‌కి ఆహ్వానించి రూ.2.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. షాద్‌నగర్‌లో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. పేదరికాన్ని జయించి దేశంలోనే పేరున్న ప్రముఖ కళాశాలలో విద్యనభ్యసించే కూతురిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఐశ్వర్య రెడ్డి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కష్టకాలంలో తమకు అండగా నిలుస్తున్న మంత్రి కేటీఆర్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటామని కుటుంబసభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని