ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ విస్తరణ: కేటీఆర్

తాజా వార్తలు

Updated : 02/04/2021 16:02 IST

ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ విస్తరణ: కేటీఆర్

ఖమ్మం: అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ అన్ని ప్రాంతాల ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఖమ్మం పర్యటనలో భాగంగా మంత్రులు పువ్వాడ అజయ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఖమ్మంలో రూ.30 కోట్లతో చేపట్టిన ఐటీ హబ్‌ రెండో దశకు భూమిపూజ చేశారు. టేకులపల్లిలో రూ.60 కోట్లతో వెయ్యి గృహాల సముదాయంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను కేటీఆర్‌ ప్రారంభించారు. ఖమ్మంలో రూ.25 కోట్లతో 30 ప్లాట్‌ఫాంలు, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన నూతన ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు దీటుగా ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. భారతదేశ వృద్ధి రేటుకంటే రెట్టింపు వేగంతో తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. హైదరాబాద్‌కు మాత్రమే ఐటీ రంగాన్ని పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరింపజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని యువతకు ఎక్కడికక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయమన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి ఉపయోగపడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. టి-ఫైబర్‌ పూర్తయిన తర్వాత ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఇవ్వబోతున్నట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని