కేటీఆర్‌ చొరవతో గర్భిణీకి సకాలంలో వైద్యం 

తాజా వార్తలు

Published : 02/06/2021 20:00 IST

కేటీఆర్‌ చొరవతో గర్భిణీకి సకాలంలో వైద్యం 

మునగాల: మంత్రి కేటీఆర్ చొరవతో ఓ గర్భిణీకి సకాలంలో వైద్యం అందింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెం వాసి వినయ్ కుమార్ సోదరి గర్భంతో ఉంది. కాన్పుకోసం కోదాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సరైన స్పందన లేకపోవడంతో వెంటనే కేటీఆర్కి ట్విటర్‌లో సాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. కేటీఆర్ చొరవతో కోదాడ పురపాలక సిబ్బంది సంబంధిత ఆస్పత్రిలో వైద్యం అందేలా చూశారు. సమస్యను పరిష్కరించిన మంత్రి కేటీఆర్కు, మున్సిపాలిటీ సిబ్బందికి వినయ్ కృతజ్ఞతలు తెలిపాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని