AP news: ఎంపీ విజయసాయి, జగతి పబ్లికేషన్స్‌కు లీగల్‌ నోటీసులు

తాజా వార్తలు

Updated : 02/08/2021 18:12 IST

AP news: ఎంపీ విజయసాయి, జగతి పబ్లికేషన్స్‌కు లీగల్‌ నోటీసులు

అమరావతి‌: పరువునష్టం దావా కేసుకు సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డికి ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు లీగల్‌ నోటీసులు పంపారు. ఆయనతోపాటు జగతి పబ్లికేషన్స్‌ ఎండీ సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి టీవీ ఈడీ వినయ్‌ మహేశ్వరి, సాక్షి పత్రిక ఎడిటర్‌ మురళి, ప్రింటర్‌-పబ్లిషర్‌ రామచంద్రమూర్తికి ఏబీ నోటీసులు ఇచ్చారు. వీరందరికీ జులై 19న పరువునష్టం దావా నోటీసులు పంపారు. ఎన్నికల్లో రూ.50 కోట్ల తరలింపునకు ఎస్కార్ట్‌ ఇచ్చారనే ఆరోపణపై ఏబీవీ ఈ దావా వేశారు. ఈ ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు. లేదంటే రూ.కోటి పరువునష్టం దావా కేసు వేస్తానని నోటీసుల్లో పేర్కొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని